నటుడు విజయ్ నటించిన తమిళ సినిమా బిజిల్ అనుకున్న ప్రకారం ఈ నెల అమెజాన్ ప్రైమ్ వీడియోలో కనిపించకపోవచ్చు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాకుండా నిలిపివేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారి చేసింది. బిజిల్ తెలుగు డబ్బింగ్ విజిల్ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ నిలిచిపోయే అవకాశముంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 13 న బిజిల్ డిజిటల్ రిలీజ్ కావాల్సి ఉంది. బిజిల్ సినిమా నిర్మాతలతో పాటు డైరెక్టర్ అట్లీ, నటుడు విజయ్ లు కాపీ రైట్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని హైదరాబాద్ కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్నికుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. కాపీ రైట్స్ ఉల్లంఘనపై అంతకు ముందే చిన్ని కుమార్ తెలంగాణ సినిమా రైటర్స్ అసోషియేషన్ పై కూడా కేసు వేశారు. కుమార్ చెప్పే దాని ప్రకారం మురికివాడల్లో నివసించే పుట్ బాల్ ప్లేయర్ అఖిలేష్ పౌల్ కథ ఆధారంగా ఈ సినిమా తీశారని..పౌల్ జీవిత చరిత్ర కాపీ రైట్స్ అన్ని 2018 లోనే తనకు దక్కాయన్నారు. దీంతో కాపీ రైట్స్ ఉల్లంఘించినందుకు థియేటర్లలో, శాటిలైట్ ద్వారా సినిమా రిలీజ్ ను ఆపేయాలని పిటిషనర్ చిన్ని కుమార్ కోర్టు ను కోరారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.