ఆర్టీసీకి పరువు నష్టం కలిగించేలా తీసిన రాపిడో యాడ్‌ను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను తొలగించాలని.. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి యాడ్‌లో నటించిన అల్లు అర్జున్‌తో పాటు రాపిడో సంస్థకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరఫున నోటీసులు జారీ చేశారు.
రాపిడో ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని.. రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని అల్లు అర్జున్ చెప్పడంపై సజ్జనార్ అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి సదరు సంస్థకు, అల్లు అర్జున్‌కు నోటీసులు కూడా పంపారు.