సైబర్ మోసగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కలర్ జిరాక్స్ పేరుతో ఒకర్ని, ఆన్ లైన్ ట్రేడింగ్ అంటూ మరొకర్ని.. మార్కెటింగ్ పేరుతో ఇంకొకర్ని మోసం చేశారు. ఈ మూడు కేసుల్లో రూ.7 లక్షలకు పైగా దోచేశారు కేటుగాళ్లు.
హైదరాబాద్ కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి కలర్ జిరాక్స్ మెషిన్ కోసం ఇండియా మార్ట్ లో సెర్చ్ చేశాడు. అయితే తమ దగ్గర ఉందంటూ టచ్ లోకి వచ్చారు సైబర్ మోసగాళ్లు. తక్కువ ధరకు ఇస్తామని రూ.1.75 లక్షలు కాజేశారు.
Advertisements
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తిని మోసం చేశారు. అధిక లాభాలు ఇస్తామని రూ.1.30 లక్షలు దోజేశారు కేటుగాళ్లు. అలాగే మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి నుంచి ఆన్ లైన్ మార్కెటింగ్ పేరుతో రూ.4.15 లక్షలు లాగేశారు. బాధితులంతా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.