డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు కొన్నేళ్ళుగా ఎంత కష్టపడుతున్నా సరే అది కట్టడి కావడం లేదు. పోలీసుల కళ్ళు గప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు. ఇక ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో ఒక డ్రగ్స్ కేసు బయటకు వచ్చింది. ఈ డ్రగ్స్ కేసు ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఎక్సైజ్ పోలీసుల విచారణ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైద్రాబాద్ లో ప్రముఖులకు గోవా నుంచి డ్రగ్స్ ను డ్రగ్ డీలర్ డాడీ బాయ్ పంపించాడు.
నాలుగేళ్ళ క్రితం వరకు హైద్రాబాద్ లో ఉండి డ్రగ్ బిజినెస్ నడిపిన డాడీ బాయ్… గతం లో డ్రగ్స్ అమ్ముతూ హైద్రాబాద్ లో టాస్క్ఫోర్స్ పోలీసులకు దొరికాడు. గోవా , బెంగుళూర్ కేంద్రం గా డ్రగ్స్ ను హైద్రాబాద్ పంపిస్తూ ఉంటాడు అని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. 153 గ్రాముల కొకెయిన్ ని ఒకే సారి హైద్రాబాద్ పంపి ఇక్కడ ప్రముఖలకు డ్రగ్స్ డెలివరీ చేయించే విధంగా ప్లాన్ చేసాడు.
హైద్రాబాద్ లో కొందరు ప్రముఖులకు, కాలేజీ విద్యార్ధులకు “గుడ్ స్టఫ్” అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్ లు వస్తు ఉంటాయి. అయితే జేమ్స్ అనే నైజీరియన్ ద్వారా డ్రగ్స్ డెలివరీ జరుగుతూ ఉంటుంది. ఫోన్ నెంబర్లు ఇవ్వకుండా వ్వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ప్రముఖ హోటల్స్ , నెక్లస్ రోడ్ , చెక్ పోస్ట్ , డ్రైవ్ ఇన్ లే డెలివరీ స్పాట్స్ అని పోలీసులు గుర్తించారు.
ఓకే సారి బల్క్ ఆర్డర్స్ చేసారు కొందరు పుత్రరత్నాలు. ఈ నెల 14 న బస్సు ద్వారా హైద్రాబాద్ కు డ్రగ్స్ వచ్చాయి. పక్కా సమాచారంతో డ్రగ్ డెలివరీ బాయ్ జేమ్స్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. బల్క్ ఆర్డర్ చేసిన ప్రముఖుల ఫై ఎక్సైజ్ ఆరా తీస్తుంది. ఓకే సారి 153 గ్రాముల కొకెయిన్, ఎండీఎంఏ దొరకడం తో డ్రగ్స్ వ్యవహారం ఫై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా ముందుకు వెళ్తుంది.