రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతూ పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడిన ఫేక్ ఆఫీసర్ పోలీసులకు చిక్కాడు. తనను తాను ఐపీఎస్ గా చిత్రించుకుని. లేని అధికారాన్ని సృష్టించుకుని ఎదుటి వారి భయాన్ని మనీగా మార్చేసుకుంటున్నాడీ నకిలీగాడు.
సైబరాబాద్లో ఏకంగా కార్యాలయమే తెరిచి.. ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు, సెటిల్మెంట్ల పేర్లతో దారుణంగా దోచుకుంటున్నాడు. మోసాలు బాధితులకు ఇంటరాగేషన్ పేరుతో చుక్కలు చూపెడుతున్నాడు.
ప్రత్యేక పోలీస్ అధికారి పేరుతో నకిలీ ఐపీఎస్ రామ్ వ్యవహారం నడుపుతున్నాడు. హైదరాబాద్ కు చెందిన మహిళను ట్రాప్ చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. జాగ్వర్ కార్లను అతి తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు.
పోలీస్ విచారణ పేరుతో చాలామందిని చిత్రహింసలకు గురిచేశాడు. తుపాకులు, పోలీస్ వాహనాల, సైరన్లను వేసి బెంబేలు సృష్టించాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నకిలీ ఐపీఎస్ రామ్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం డబ్బులు వసూలు చేసింది.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.