రాజధాని హైదరాబాద్ నగరంలో చిరుత పులుల సంచారం హాడలెత్తిస్తోంది. అడవుల్లో ఉండాల్సిన చిరుతలు నగరంలోని రోడ్లపై దర్జాగా తిరుగుతుండటం చూసి జనం భయం భయంగా ఉన్నారు.
గోల్కొండ ఏరియాలో చిరుత సంచరిస్తుందన్న వార్తలతో అంతా వణికిపోయారు. అధికారులు రంగంలోకి దిగారు. అయితే అది చిరుత కాదని నల్లపిల్లి అని తేల్చటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. దాన్ని అధికారులు జూకు తరలించారు.
ఇక బుద్వేల్ పరిసర ప్రాంతాల్లో చిరుత నడిరోడ్డుపై దర్జాగా తిరిగింది. కాలికి గాయం కావటంతో రోడ్డుపైనే ఉండగా ఓ లారీ డ్రైవర్ దగ్గరగా వెళ్లటంతో ఆయనపై దాడి చేసి, పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి, చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరుతను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను వాడిన ఆచూకి లభ్యం కాలేదు. దాంతో కుక్కలు, మేకలను ఎరగా వేసి వాటిని ఆ పొదల్లోకి పంపారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.