హైదరాబాద్ లో రోడ్డు ఉన్నట్టుండి కుంగింది. హిమాయత్ నగర్ ప్రాంతంలో ఇది జరిగింది. దాదాపు 10 అడుగులకు రోడ్డు కుంగిపోయింది. ఆ సమయంలో ఓ లారీ అందులో ఇరుక్కుపోయింది.
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హిమాయత్ నగర్ లో స్ట్రీట్ నెంబర్ 5లో టిప్పర్ లారీ వెళ్తుండగా రోడ్డుపై కుంగిపోయింది. లారీ మట్టి రోడ్డుతో వెళ్తోంది. కుంగిన రోడ్డు పక్కనే నాలా ప్రవహిస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు.
మరోవైపు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు చాలాసేపు ఆటంకం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
గత నెలలో ఇదేవిధంగా గోషామహల్ చాక్నవాడిలో పెద్దనాలా కుంగిపోయింది. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, దుకాణాలు పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.