హైద్రాబాద్ మెట్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారంనాడు సమ్మెకు దిగారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలనే డిమాండ్ తో తాత్కాలిక ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.ఎల్‌బీనగర్ నుండి మియాపూర్ లైన్ లో ఉన్న మెట్రో ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హైద్రాబాద్ రసూలుపురా మెట్రో ఆఫీస్ వద్ద మెట్రో ఉద్యోగులు ఇవాళ ధర్నా చేయనున్నారు. హైద్రాబాద్ మెట్రోలోని టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు.
ఎల్బీ నగర్ నుండి మియాపూర్ లైన్ లో టికెట్ కౌంటర్లలో సుమారు 300 మంది విధులు నిర్వహించాలి. కానీ ఇవాళ 150 మంది మాత్రమే విధులకు హాజరైనట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.ఐదేళ్లుగా తమ వేతనాలు కూడా పెంచలేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
తమకు 5 ఏళ్లుగా 11 వేల రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని.. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో.. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.