టికెట్ లెస్ సర్వీస్‌ను తీసుకొచ్చిన హైదరాబాద్ మెట్రో జనవరి నుండి మంత్లీ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకరానుంది. మంత్లీ పాస్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో… హైదరాబాద్ మెట్రో మార్గదర్శకాలను తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే మెట్రో-ఆర్టీసీ-ఎంఎంటీఎస్ కామన్ పాస్ రావడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టే అవకాశం కనపడుతోంది.
ఇప్పుడు తీసుకరాబోయే పాస్‌లు కూడా బస్‌పాస్‌ల లాగా… ఎక్కడి నుండి ఎక్కడికైనా చెల్లుబాటు కావని తెలుస్తోంది. కేవలం స్టేషన్ టు స్టేషన్ మాత్రమే పనిచేస్తుందని సమాచారం.