హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యతో మూసారంబాగ్ స్టేషన్ లో రైలు నిలిచిపోయింది. దీంతో మైట్రోరైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ ట్రైన్ ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తోంది.
మెట్రో రాకపోకలు నిలిచిపోవడంతో స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత సమస్య క్లియర్ కావడంతో యథావిధిగా సేవలు కొనసాగాయి. అయితే.. ఆలస్యం కారణంగా.. మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించాయి.
సరిగ్గా ఆఫీసులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడంతో రద్దీ ఎక్కువగా కనిపించింది. గతేడాది చాలార్లు మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సమయాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Advertisements
నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, దూళి కాలుష్యం పెరగడంతో మెట్రో రైళ్లు దూసుకెళ్లే మార్గంలో రెడ్ లైట్లు వెలుగుతున్నాయి. దీంతో కొన్నిసార్లు రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని అంటున్నారు.