డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించే వారికి హైదరాబాద్ మెట్రో ఓ ఆఫర్ ఇచ్చింది. 31 వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రత్యేక సర్వీస్ లు అన్ని స్టేషన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనితో మందుబాబులు కుషీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఏటా మద్యం ప్రియులు ఫుల్ గా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతుంటారు. వీరిలో మహిళలు, సెలబ్రిటీ లు కూడా పట్టుబడుతుంటారు. మరికొంత మంది ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. దీనిని ద్రుష్టిలో పెట్టుకుని మెట్రో అధికారులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అయితే మద్యం తాగినవాళ్లు మెట్రో వీరంగం చెయ్యరా అనే అనుమానం కూడా రావచ్చు దానిపై కూడా అధికారులు స్పష్టత ఇచ్చారు. మద్యం సేవించిన వ్యక్తులను మెట్రోలోకి అనుమతిస్తామని కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే ఆ అవకాశం కల్పిస్తామని తెలిపారు. మద్యం తాగి మెట్రో వీరంగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అర్ధరాత్రి వరకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1.30 వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు ఉంటాయని తెలిపారు. అర్ధరాత్రి 1.30 గంటలకు లింగంపల్లి – ఫలక్‌నుమా, 1.15 గంటలకు లింగంపల్లి – హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని వెల్లడించారు.