హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్పీడ్ అందుకుంది. మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ… అధికారులు సిబ్బందిని పెంచారు. మొదటి ప్రియారిటీ ఓట్లలో ఎవరికి మెజారిటీ రాకపోవటంతో…సెకండ్ ప్రియారిటీ ఓట్లు లెక్కిస్తున్నారు.
హైదరాబాద్ స్థానంలో… సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు 87 మంది ఎలిమినేట్ అయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 93 మందిలో ఇప్పటివరకు 87 మంది ఎలిమినేషన్ లో వెళ్లిపోయారు.
సెకండ్ ప్రియారిటీ లెక్కింపులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 3,930 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు 1,916 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 2,477 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 2,044 ఎలిమినేషన్ ఓట్లు బదిలీ అయ్యాయి. వాణీదేవి భాజపా అభ్యర్థిపై 10,035 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా వాణీదేవికి 1,16,619 ఓట్లు, రాంచందర్‌రావుకు 1,06,584 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 56,087 ఓట్లు చిన్నారెడ్డికి 33,598 ఓట్లు వచ్చాయి.
విజయానికి 1,68,520ఓట్లు అవసరం ఉంది.