హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున నిర్వహించే ఎగ్జిబిషన్ ఈ ఏడాది వాయిదా పడింది. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటం, కరోనా నియంత్రణ మార్గదర్శకాలను పాటించటం ఇబ్బందవుతుందన్న కారణంగానే నుమాయిష్ ను వాయిదా వేశామని, రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ప్రకటించింది.
ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 45 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించటం అనవాయితీగా వస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే ఈ నుమాయిష్ లో అన్ని రకాల ప్రదర్శనలు చేస్తూ… కొనుగోలు చేసేందుకు ప్రజలకు అనుమతి ఇస్తారు.