కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించటంతో తెలంగాణ పోలీసులు రోడ్ల మీదే డ్యూటీ చేయాల్సి వస్తోంది. కోవిడ్ వారియర్స్ లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా ఉంటూ పనిచేస్తున్నారు. ఇంటికి వెళ్లినా భయంభయంగా కుటుంబంతో భయపడుతూ మనో వేదన చెందారు.
అయితే… తీరిక లేకుండా, కనీసం వీకాఫ్ లేకుండా ఉంటున్న కానిస్టేబుల్స్ కు హైదరాబాద్ కమీషనర్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 2వ వారం నుండి తీరిక లేకుండా పనిచేస్తున్న కానిస్టేబుల్లందరికీ వీకాఫ్ ఇవ్వాలని ఇన్ స్పెక్టర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. రోటేషన్ పద్దతిలో ప్రతి ఒక్కరికి వారంలో ఓ రోజు సెలవు ఇవ్వాలని చెప్పారు.
ఈ నిర్ణయంపై సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో కమీషనర్లు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.