ఎన్‌ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఎంఐఎం శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టబోతుంది. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి ఇటీవల ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన మిలియన్ మార్చ్‌కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి. పాతబస్తీ, మెహిదీపట్నం, మల్లేపల్లి, మలక్‌పేట్, ముషీరాబాద్, నాంపల్లితో పాటు వివిధ బస్తీల నుండి వచ్చిన జనం అంతా హసన్‌నగర్, ఆరాంఘర్, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, కింగ్స్‌కాలనీ, బాబా కాంటా వరకు ర్యాలీగా వెళ్లబోతున్నారు. అక్కడే ఎంఐఎం అధినేత ఓవైసీ ప్రసంగించబోతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు.
పోలీసులు ఆంక్షలు విధించిన రూట్స్ ఇవే:
శంషాబాద్, కాటేదాన్ మార్గాల నుంచి వచ్చే వాహనదారులను బహదూర్‌పురా, జూపార్కుల వైపు వెళ్లడానికి అనుమతించరు. వారు ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు నుంచి మెహిదీపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది
ఆరాంఘర్ జంక్షన్, కాటేదాన్ నుంచి వెట్లేపల్లి గేటు, శాస్ర్త్రిపురం వెళ్లే వాహనదారులు చంద్రాయణగుట్ట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది
రాజేంద్రనగర్, ఆరాంఘర్ నుంచి వచ్చే వాహనాలను కిషన్‌బాగ్, బహదూర్‌పురా వైపు అనుమతించరు. వారు పిల్లర్ నంబర్ 202 వద్ద డైవర్షన్ తీసుకొని మెహిదీపట్నం మీదుగా వెళ్లాలి.
మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలను కిషన్‌బాగ్, బహదూర్‌పురా వైపు అనుమతించరు. వారు పిల్లర్ నెం 143 హైదర్‌గూడ వద్ద ఆరాంఘర్‌మీదుగా వెళ్లాలి
ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా శాస్త్రిపురం వైపు వెళ్లే వాహనదారులు మెహరాజా హోటల్ వద్ద డైవర్షన్ తీసుకొని ఫలక్‌నుమా వైపు వెళ్లాలి
దానమ్మ గుడిసె, హసన్‌నగర్ నుంచి కింగ్స్ కాలనీ, శాస్త్రిపురం వైపు వెళ్లే వాహనదారులు బాబా కాంటా వద్ద టర్నింగ్ తీసుకొని ఆరాంఘర్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.