2019 మోటార్ వెహికల్స్ చట్టాన్ని అమలు చేస్తున్నామని… ద్విచక్ర వాహనదారులంతా ఇక నుండి మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. బైక్ నడిపితే హెల్మెట్ తప్పనిసరని, హెల్మెట్ లేకుండా ఫస్ట్ టైం దొరికితే మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. అంతేకాదు మహిళలైనా, పురుషులైనా… వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి అని తెలిపారు. లేకపోతే భారీగా జరిమానాలుంటాయన్నారు. ఇప్పటికే రాచకొండ పరిధిలో ఈ రూల్స్ అమల్లో ఉన్నాయని, ఇక నుండి సైబరాబాద్ పరిధిలోనూ అమల్లోకి తీసుకరాబోతున్నట్లు తెలిపారు.