జీహెచ్ఎంసీ అత్యుత్సాహంపై హైదరాబాదీల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇంటి ముందు తగిలించే టూ- లెట్ బోర్డులపై కూడా బల్దియాకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్( EVDM) జరిమానాలు విధిస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ నోటీసు చక్కర్లు కొట్టడంతో నగర నెటిజన్లు భగ్గమన్నారు. నగరంలో అనేకానేక సమస్యలు ఉంటే.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు టూ- లెట్ బోర్డులే దొరికాయా అంటూ విరుచుకుపడ్డారు. టూ – లెట్ బోర్డులు పెట్టకపోతే ఇళ్లు ఖాళీగా ఉందన్న ఎలా తెలుసుకోవాలని తమ పోస్టుల్లో నిలదీశారు. ఇంటింటికి వెళ్లి అడుక్కోవాలా అంటూ ఫైర్ అయ్యారు.
మరోవైపు తాము ఇచ్చిన నోటీసులపై ప్రధాన మీడియాలో వార్తలు రావడంతో…చివరికి ఈవీడీఎం ఘాటుగా స్పందించింది. టూ-లెట్ బోర్డులపై జరిమానాలు విధిస్తున్నట్లు ఎల్లో జర్నలిస్టిక్ ఆర్టికల్స్ ప్రచారం జరిగాయని ఆరోపించింది. సొంత ఆస్తిపై టూ-లెట్ బోర్డులు జరిమానా విధించబడవని స్పష్టం చేసింది. ఆ పోస్టర్లు / బోర్డులు బహిరంగ ప్రదేశాల్లో పెట్టినప్పుడు మాత్రమే జరిమానా విధిస్తామని తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని వెల్లడించింది.
Certain yellow journalistic articles are on circulation claiming that @CEC_EVDM is levying penalties on To-Let boards of individuals. It is clarify that To-Let boards on the concerned property are not liable to be penalized 1/2 pic.twitter.com/hF5KlKzvLu
— Director EV&DM, GHMC (@Director_EVDM) August 20, 2021
Advertisements
మరోవైపు ఈవీడీఎం ఇచ్చిన వివరణపై కూడా నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. టూలెట్ బోర్డులపైనే మీ ప్రతాపం చూపిస్తారా.. లేక పొలిటికల్ బ్యానర్లు, కటౌట్‌లపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఇంతవరకు ఎక్కడెక్కడ జరిమానా విధించారో కూడా చెబుతారా అంటూ నిలదీశారు.