యజమాని షాపునకే కన్నం వేసిన డ్రైవర్ని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. రూ.7 కోట్లు విలువైన వజ్రాలు, బంగారు ఆభరాణాల పరారైన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు.ఇటీవల హైదరాబాద్లో రాధిక డైమండ్స్లో జరిగిన ఈ దొంగతనం సంచలనం సృష్టించింది.
రాధిక డైమండ్స్ లో రెండు నెలల క్రితమే డ్రైవర్గా పనిలోకి చేరిన శ్రీనివాస్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు విలువైన బంగారు ఆభరణాలను దొంగతనం చేయాలని కుట్రపన్నారని డీసీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.
మధురానగర్‌లో ఓ కస్టమర్‌కు ఇయర్ రింగ్స్ చూపించడానికి సేల్స్‌మెన్ అక్షయ్ కుమార్‌తో పాటు శ్రీనివాస్ వెళ్లారన్నారు. అక్షయ్‌కుమార్ ఇయర్ రింగ్స్ డెలివరీ చూపించడానికి కస్టమర్ ఇంట్లోకి వెళ్లగానే డ్రైవర్ శ్రీనివాస్ అప్పటికే కారులో ఉన్న మిగతా ఏడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పారిపోయాడని వివరించారు.
నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆధారాలను పరిశీలించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుణ్ని పట్టునేందుకు చాకచక్యంగా పని చేసిన పోలీసు సిబ్బందికి నగదు బహుమతి అందజేశారు.
అక్షయ్కుమార్ రాధిక డైమండ్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు కారు డ్రైవర్ శ్రీనివాస్ ఉన్నాడు. అక్షయ్ ఇయర్ రింగ్స్ చూపడానికి కస్టమర్ ఇంట్లోకి వెళ్ళగానే కారు డ్రైవర్ నగలతో ఉడాయించాడు. కంప్లయింట్ రాగానే కేసు నమోదు చేశాం.
హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఆదేశాలమేరకు ఆరు జట్లుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నాం, నిందితుడి పూర్తి పేరు వెలిశెట్టి శ్రీనివాస్ పోసి.
అతడి స్వస్థలం కొవ్వూర్, ప్రస్తుతం మధురానగర్ హాస్టల్లో ఉంటున్నాడు. రాధిక డైమండ్స్ కంపెనీల రెండు నెలల క్రితమే డ్రైవర్గా పనిలోకి చేరాడు. నిందితుడి నుంచి 82 రకాల బంగారు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నామని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.