తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చందానగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఉపాధ్యాయురాలు పదో తరగతి విద్యార్థితో పారిపోయింది. ఈ ఘటన చందానగర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చందానగర్ లోని ఓ మహిళ (26) ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. గచ్చిబౌలికి చెందిన ఓ విద్యార్థి (15) ఇదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కాగా ఫిబ్రవరిలో.. సదరు మహిళా టీచర్ తాతయ్య.. తన మనమరాలు కల్పించడం లేదంటూ చందానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.
ఆ తర్వాత రెండు రోజులకి తన మనవరాలు తిరిగి వచ్చిందని కేసు విత్ డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. సరిగ్గా టీచర్ అదృశ్యమైన రోజుల్లోనే తమ కొడుకు కూడా కనిపించడం లేదంటూ 10వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు అతను కూడా తిరిగి వచ్చాడంటూ వారు కూడా కేసు విత్ డ్రా చేసుకున్నారు.
విద్యార్థిని పోలీసులు ఎక్కడికి వెళ్లావు అని కూపీలాగారు. దీంతో ఆ విద్యార్థి చెప్పిన విషయం విని తల్లిదండ్రులు, పోలీసులు షాక్ అయ్యారు.తాను తన స్కూల్లోని మహిళా టీచర్ తో కలిసి ఫిబ్రవరి 16వ తేదీన వెళ్లినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు టీచర్ ని పిలిచి విషయం కనుక్కున్నారు. నిజమే అని తేలింది. దీంతో టీచర్ కు, విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమించుకున్నట్లుగా తేలింది. టీచర్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. ఇది నచ్చని టీచర్, స్టూడెంట్ ఈ విధంగా చేసినట్లుగా పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.