పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక… సినిమాలను స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ కంప్లీట్ చేయగా, అయ్యప్పునం కోష్యిం మూవీ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే వారం రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేసిన పవన్, క్రిష్ కు మరో పది రోజుల డేట్స్ అడ్జెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పిరియాడికల్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో 17వ శతాబ్ధంలో హైదరాబాద్ ను చూపించాల్సి ఉంటుంది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇందుకోసం ఓ ప్రత్యేక సెట్ వేస్తున్నారు. ఒక్క చార్మినార్ మాత్రమే కాదు… ఏకంగా వారికి కావాల్సిన ప్రదేశాలతో కలిసి ఓ కొత్త నగరాన్ని నిర్మించేస్తున్నారు.
రాజీవన్ నేతృత్వంలో ఇప్పటికే గండీకోట సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.