మృత్యువెలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా ఊపిరొదిలేస్తారు. కన్న తల్లిదండ్రలను, భార్యా బిడ్డలను,తోబుట్టువులను దగాచేసి వెళ్ళిపోతారు. అలాంటి విషాదకర సంఘటన ఒకటి హైదరాబాద్ లో చోటుచేసుకుంది.కొత్తగా పెళ్ళైన యువకుడు భార్యతో హనీమూన్ కి వెళ్ళి విగతజీవిగా తిరిగివచ్చాడు. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వంశీ కృష్ణ ఈ నెల 13న భార్య శ్రావణితో కలిసి హనీమూన్ కి ఇండోనేషియా వెళ్లాడు. ఈ జంట 22వ తేదీన ఉదయం సరదాగా గడిపేందుకు బాలిలోని పెన్నిడా ఐలాండ్ కు వెళ్లారు.
అక్కడ సముద్ర చేపలను చూడడానికి వంశీ స్కూబా డైవింగ్ చేయాలనుకున్నాడు. ఆక్సిజన్ మాస్క్, డైవింగ్ షూస్ అన్నీ పెట్టుకొని అతను సముద్రంలోకి దిగాడు. అంతలోనే ప్రాణాలు కోల్పోయి తిరిగిరాలేదు. అదే రోజు సాయంత్రం వంశీ మృతదేహం వేరేతీరంలో పడిఉంది.
తన భర్త శవంగా పడిఉండడాన్ని చూసిన శ్రావణి గుండెపగిలేలా ఏడ్చింది. డైవింగ్ చేసినప్పుడు అతడికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్లు తెలుస్తోంది. వంశీ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రేపు సాయంత్రానికి వంశీ మృతదేహం హైదరాబాద్‌కి చేరుకోనున్నట్టు వంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని నాగోల్లో నివాసముంటున్న వంశీకృష్ణ గత ఏడాది జూన్‌లో శ్రావణితో వివాహమైంది. గ్రూప్–1పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి అర్హత సాధించి, మెయిన్స్ రాసేందుకు సంసిద్ధమవుతున్నాడు.