తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తుండగా, హైదరాబాద్ లోనూ గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు.
ఆదివారం నుండి నగర శివార్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారు జామున చలిపులి వణికిస్తోంది. శివార్లలో అత్యల్పంగా బీహెచ్ఈఎల్ వద్ద 12.5 డిగ్రీలు, బండ్లగూడ 12.9, కుత్బుల్లాపూర్‌లో 13.9, రాజేంద్రనగర్‌లో 14.1, గచ్చిబౌలిలో 14.4, వనస్థలిపురంలో 14.5, హయత్‌నగర్ 14.6, మాదాపూర్ 15.1, షాపూర్‌నగర్ 15.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.