బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాద ఘటనలో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపై 304(2) సెక్షన్ ఎలా పెడుతారంటూ రాయదుర్గం పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ జనవరి ౩వరకు వాయిదా వేసి, అప్పటి వరకు కల్వకుంట్ల మిలాన్ రావును అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది.
గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఓవర్ స్పీడ్‌తో వెళ్లి… ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 104 స్పీడ్‌తో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారు అని పోలీసులు కేసు నమోదు చేయగా, ఫ్లైఓవర్ డిజైన్‌లోనే లోపముందని కల్వకుంట్ల మిలన్‌రావు కోర్టును ఆశ్రయించారు.
అయితే, పోలీసుల సాక్షాధారాలను చూపటంలోనూ… కేసు తీవ్రతను పట్టించుకోకుండా నామమాత్రంగా వదిలేస్తుండటంతోనే ఇలా జరుగుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్