నేనున్నాను చిత్రంలో నాగార్జున ఐరన్ బాక్స్ మీద దోశలు వేసి హీరోయిన్ కు తినిపించే సన్నివేశం మీకు గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాగే కాకపోయినా ఓ యువకుడు వేసిన దోశల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తన స్కూటీపై దోశలు వేశాడు యువకుడు.
ఎండాకాలం వాహనాన్ని కాసేపు ఎండలో పెడితే సీటు వేడెక్కిపోతుంది. దీన్నే వినూత్నంగా చూపించాడు యువకుడు. హైదరాబాద్ లో ఎండలు ఎలా మండిపోతున్నాయో వీడియో రూపంలో తెలియజేశాడు. తన స్కూటీ సీటుపై దోశలు పోశాడు. గరిటెతో అటూ ఇటూ దోశను తిప్పాడు.
ఎండవేడికి అది పెనం మీద వేసిన దోశలాగే కాలింది. ఈ సరదా వీడియోకు ‘‘దీనిని ఇంట్లో ప్రయత్నించవద్దు’’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడీ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
దీనిని చూసిన కొందరు నెటిజన్లు ‘ఇంట్లో వాడుకునే దోశల పెనం కంటే ఆ సీటు కవరే బాగుందని’ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.