హైపర్ ఆది గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హైపర్ ఆది. తన పంచ్ డైలాగులతో మంచి క్రేజ్ ను కూడా తెచ్చుకున్నారు. ఓవైపు షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా హైపర్ ఆది కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు బహిరంగంగానే తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని చెప్పుకొచ్చాడు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరోసారి పవన్ పార్టీ జనసేన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కి తానెప్పుడూ సపోర్ట్ చేస్తానని, గతంలో ఎలక్షన్స్ సమయంలో జనసేన పార్టీకి క్యాంపెయిన్ కూడా చేశానని అన్నారు. ఫ్యూచర్‌లో పాలిటిక్స్ లోకి వెళ్లాలనే ఆలోచన వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీలోనే చేరతానని అన్నారు.