బిగ్ బాస్ 4 వచ్చేస్తుండటంతో అందులో ఈసారి ఎవరెవరు పాల్గొంటారు, షో ఎన్ని రోజులు ఉంటుంది, నాగ్ మరోసారి బుల్లితెరపై అలరిస్తాడా అన్న చర్చ జోరందుకుంది. అయితే ఈసారి పార్టిసిపెంట్ లిస్టులో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది ఉంటాడని ముందు నుండి ప్రచారం జరిగింది. ఇందుకోసం ఆది జబర్ధస్త్ ను కూడా వదిలేసేందుకు సిద్ధమయ్యాడంటూ ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపించింది.
తెలుగు ప్రేక్షకును వారం వారం నవ్వించటంలో ఆది ముందుంటాడు. అందుకే షో అయిపోయినా… సోషల్ మీడియాలో ఆది స్కిట్స్ కు ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటి ఆది బిగ్ బాస్ కు వెళ్తే… కనీసం రెండు నెలలు అయినా కనపడడు అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
కానీ తాజాగా ఫిలింనగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది బిగ్ బాస్ 4 నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మొదట వెళ్లాలని అనుకున్నప్పటికీ ఈ ఏడాదికి దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నాడట. పైగా వీక్లీ షోలో కూడా పేమెంట్ ఆఫర్ ఎక్కువగా రావటం, కరోనా సమయంలో రిస్క్ అవసరమా అన్న ఉద్దేశంతో ఆది బిగ్ బాస్ సీజన్ 4కు నో చెప్పినట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని తెలియాలంటే ఆది నోరు విప్పాల్సిందే.