బుల్లితెరపై మంచి ఫాలోయింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్. షోలో ప్రదీప్ ఉన్నాడంటే చాలు… ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేరు. యాంకర్‌గా మెప్పించిన ప్రదీప్, ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా…? అనే సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఇప్పటికే విడుదలైన ప్రదీప్ సినిమా సాంగ్స్ మంచి హిట్ కొట్టాయి. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం పాట యూట్యూబ్‌లో సంచలనం అవుతోంది. ఫస్ట్ సాంగ్ నుండే సినిమాపై అంచానాలను పెంచేస్తున్న ఈ సినిమాకు ప్రదీప్ అండ్ కో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది.
అయితే, ఈ సినిమా ఎక్కువగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగనుంది. మొదటి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న ప్రదీప్… సినిమాలో స్క్రిప్ట్, డైలాగ్స్ కోసం పంచ్ డైలాగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన తన ఫ్రెండ్ హైపర్ ఆది సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాలో హైపర్ ఆది మార్క్ కామెడీ ఉండబోతున్నట్లు సమాచారం.