చెన్నై: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఫాన్స్ ఉన్నారు. బ్యాడ్మింటన్ గేమ్ అడుతున్నప్పుడు అంతా ఆసక్తిగా తిలకిస్తారు. ప్రపంచ చాంపియన్ అయ్యాక ఎన్నో బహుమతులు వచ్చాయి. కానీ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ లో మునిగితేలే పీవీ సింధుకు కూడా వ్యక్తిగతంగా కొన్ని ఇష్టాలుంటాయి. మూవీల్లో వైవిధ్యమైన పాత్రలతో మైమరపించే విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే పీవీ సింధుకు ఎంతో అభిమానమట.
అందుకే ప్రత్యేకంగా చెన్నైలో భారత ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సౌత్ స్టార్ కమల్ హాసన్ ను కలుసుకుంది. తన అభిమాన నటుడితో కొద్దిసేపు ముచ్చటించి తన అభిమానాన్ని చాటుకుంది. అంతేకాదు లంచ్‌లో ఇద్దరూ కలసి భోజనం చేశారు. వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గిన పీవీ సింధును ఈ సందర్భంగా కమల్ ప్రశంసించారు.
కమల్ తన అభిమాన హీరోఅని, అందుకే ఆయన్ని కలిశానని సింధు చెప్పింది. తన లక్ష్యం టోక్యో ఒలింపిక్స్ అని పేర్కొంది. లక్ష్యసాధనకు సన్నద్ధమయ్యే ముందుగా ఆటవిడుపుగా అభిమాన హీరో కమల్ హాసన్ ను కలుసుకోవడం ఆనందంగా ఉందని సిందు చెప్పింది.