తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. అయితే తన పోటీ ఏ నియోజకవర్గం నుంచి ఉంటుందనే విసయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. ఆ వివరాలని తర్వాత ప్రకటిస్తానని చెప్పారు.
తమిళనాడులో ఎన్నికల హీట్ పెరగడంతో.. మక్కల్ నీధి మయం కార్యకలాపాలను కమల్ వేగవంతం చేశారు. వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఇప్పటికే విమర్శల దాడిని పెంచారు. మరోవైపు మరో నటుడు రజినీకాంత్ కూడా ఈనెలాఖరున పార్టీ ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో తమిళనాడులో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.