మొదట్లో వరుస అవకాశాలతో దూకుడు కొనసాగించిన హీరోయిన్ రెజీనా తరువాత నెమ్మదించింది. అడవీ శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఎవరు సినిమాలో చివరగా నటించింది రెజీనా. ఆ సినిమాలో నెగిటివ్ షెడ్ లో కనిపించి అదరగొట్టింది. ఆ తరువాత మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం నేనేనా అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తోంది రెజీనా. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తోన్న ఆచార్య సినిమాలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
ఇదిలా ఉండగా రెజీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంపై స్పందించింది. తాను సామజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం చాట్ చేయనని స్పష్టం చేసింది. అభిమానులతో చాట్ చేయడం తప్పేమి కాదు. కానీ పర్సనల్ విషయాలను అడుగుతుంటారు. అలాగే కొంతమంది అసభ్యకరమైన కామెంట్స్ చేస్తుంటారు. అది నాపై విపరీతమైన ప్రభావం చూపిస్తుందన్నారు. నెగిటివిటీని నేను అస్సలు తట్టుకోనని చెప్పారు. సోషల్ మీడియా లేని రోజుల్లో సినీ తారలకు సంబదించిన విషయాలను చాలా గోప్యంగా ఉండేవని.. తాను అలాంటి పరిస్థితులను కోరుకుంటున్నాని చెప్పారు రెజీనా.