రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో యుద్దానికి సిద్ధంగా ఉన్నానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేవారు. భగవంతుడి దయతో నా మీద ఉన్న మీ ప్రేమ వట్టిగా పోదు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తానని ఆయన అన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఖమ్మం నగరంలోని ఒక కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనని ప్రజలు కోరుకుంటున్నారని ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తిలో శ్రీనివాస్ రెడ్డి పేరు అభిమానంతో ఉన్నదని, వారి కోరిక మేరకు వారు ఆశించినట్లుగా తాను భవిష్యత్తులో రాజకీయ చదరంగానికి సిద్ధం అవుతున్నట్లు ఆయన తెలిపారు.
రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పరిణామాలు జరుగుతాయని అన్నారు.,పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాననీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసి దిన దినాభివృద్ధి జరిగి ఆ భగవంతుడి దయతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాని అన్నారు. జగనన్న ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చానని, రాజకీయాల్లోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజల అభిమానం పొంది ఎంపి అయ్యానన్నారు.
పార్లమెంట్ సభ్యుడిని అని గర్వం లేకుండా ఎప్పుడూ మీతోనే కలిసి మమైకం అయి ఉన్నానని, గడిచిన నాలుగేళ్లలో ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో మీ అందరికి తెలుసు అన్నారు ఆయన. అధికారం పదవి ఉన్న లేకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతానికి వెళ్లిన అదే ప్రేమతో నన్ను ఆదరించారని తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు పొంగులేటి దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతుంది. ఆయన భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది