అవకాశమిస్తే అల్లుకుపోతా..

పీసీసీ అధ్యక్ష పదవికి తాను అర్హురాలినేనని ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత డీకే అరుణ. అధిష్టానం అవకాశం ఇస్తే టీపీసీసీ అధ్యక్ష పదవిని సవాల్‌గా స్వీకరిస్తానన్నారు. పాలమూరు జిల్లాలో గ్రూపులకు సీనియర్‌ నేతలు ఆజ్యం పోయడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డితో వ్యక్తిగత విభేదాలు లేవని.. కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు జైపాల్‌రెడ్డి, రేవంత్‌ సహా ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని ఆమె తెలిపారు.


టీఆర్‌ఎస్‌ ఓటమిని కోదండరాం కోరుకుంటే కాంగ్రెస్‌తో కలిసి రావాలని కోరారు. కాంగ్రెస్‌ సింగిల్‌ లీడర్‌ రాహుల్‌గాంధీనేనని, రాహుల్‌ను చూసే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తారని అన్నారు. నాగం జనార్దన్‌రెడ్డిని అడ్డుకోవడం లేదని, నాగం రాకతో పాలమూరు కాంగ్రెస్‌లో గ్రూపులు లేకుండా చర్యలు తీసుకోవాలని డీకే అరుణ పార్టీ అధిష్టానానికి సూచించారు.