వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఇవాళ విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మీటింగ్ ల కారణంగా నేటి విచారణకు హాజరు కాలేక పోతున్నానని సంక్రాంతి తర్వాత తేదీని నిర్ణయిస్తే విచారణకు హజరు అవుతానని అధికారులకు సమాచారం ఇచ్చినట్లు మల్లు రవి తెలిపారు.
తనపై కేసు నమోదు చేశారని తెలుస్తోందని అయితే దీనిపై తనకు సమాచారం లేదన్నారు. కాగా కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈనెల 12 న విచారణకు రావాలని ఆదేశించారు.
అయితే ఇతర కార్యక్రమాల వల్ల ఇవాళ్టి విచారణకు రాలేకపోతున్నానని అధికారులకు మేసేజ్ పంపినట్టు గురువారం మల్లు రవి వెల్లడించారు. మరో తేదీని ఫిక్స్ చేస్తే తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. గంట పాటు అధికారలు ఆయనను ప్రశ్నించారు.
ఇక సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులు కాంగ్రెస్ వార్ రూం లో సోదాలు నిర్వహించారు.ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ స్ట్రాటిజిస్ట్ సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 ఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. వాటిని రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.