భారతీయ సినిమా తెరమీద చూపించే శృంగారపాళ్ళు మోతాదులోనే ఉంటాయి. ఒకవేళ హద్దుదాటితే ప్రజల నుంచో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల నుంచి సదరు అశ్లీల సినిమా విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఏది ఏమైనా భారతీయ సినిమా అశ్లీలం విషయంలో కాస్తంత గుట్టుగానే ఉంటుంది.
అయితే హాలీవుడ్ సినిమా పరిస్థితి పూర్తిగా భిన్నం. వాళ్ళే గనుక శృంగారాన్ని చూపించాలని డిసైడ్ అయితే సిల్వర్ స్క్రీనే సిగ్గుపడుతుంది అన్నట్టు ఉంటుంది వ్యవహారం.
అంతెందుకు అశ్లీల సన్నివేసాలు చిత్రించే సమయాల్లో హీరోయిన్సే ఇబ్బంది పడతారట. ఆ విషయాన్ని ఓ హాలీవుడ్ భామ బైటపెట్టింది. సినిమాల్లో కొన్నొ బోల్డ్ సన్నివేశాలు చూస్తుంటాము. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అందులోను వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే అలాంటి సీన్స్ చేసేందుకు చాలా ఇబ్బంది పడతారు. ఈ క్రమంలోనే టైటానిక్ హీరోయిన్ కేట్ విన్ స్లేట్ తన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చింది.
జేమ్స్ కామరూన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన అద్భుతమైన సినిమా ‘టైటానిక్’. 1997 లో రిలీజైనా ఈ సినిమా అత్యంత అద్భుతమైన ప్రేమ కావ్యంగా చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన క్రమంలో.. మరోసారి రీరిలోజ్ చేశారు.
టైటానిక్ స్పెషల్ షోలో దర్శకుడు జేమ్స్ కామరూన్‌లో పాటు హీరో లియోనార్టో డికాప్రియో, కేట్ విన్ స్లేట్ పాల్గొంది. ఈ సందర్భంగా కేట్ మాట్లాడుతూ.. ”టైటానిక్ సినిమా తర్వాత డికాప్రియోతో 2008లో ‘రెవల్యూషనరీ రోడ్’ సినిమా చేశాను.
దానికి నా భర్తె డైరెక్షన్ చేశారు. ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించేటప్పడు నా భర్త ముందు చేయడానికి ఇబ్బంది పడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు.