మేఘాలయా బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గో మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలూ లేవని ఆయన అన్నారు. తాను కూడా గో మాంసం తింటానని చెప్పారు. అయితే ఇతర రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయంపై తాను మాట్లాడబోనన్నారు.
మనం మేఘాలయాలో ఉన్నామన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గో మాంసం తింటారన్నారు. గో మాంసంపై రాష్ట్రంలో ఎలాంటి నిషేధమూ లేదన్నారు. అది అక్కడి ప్రజల జీవన శైలి అని తెలిపారు. దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. దేశంలో కూడా అలాంటి నిబంధన లేదన్నారు.
బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలన్నారు. దేశంలో గత తొమ్మిదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉందన్నారు. ఈ తొమ్మిదేండ్లలో దేశంలో ఒక్క చర్చిపై కూడా దాడి జరగలేదన్నారు. కేవలం ప్రతిపక్షాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీపై విమర్శలు చేస్తున్నాయన్నారు.
మనం మేఘాలయాలో ఉన్నామన్నారు. అక్కడ క్రిస్టియన్ల డామినేషన్ నడుస్తుందన్నారు. ఇక్కడ అందరూ చర్చీలకు పోతారని చెప్పారు. గోవాలో కూడా బీజేపీ అధికారంలో ఉందన్నారు. అక్కడ కూడా చర్చిలపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. నాగాలాండ్ లోనూ అదే పరిస్థితి ఉందన్నారు.