కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా మాస్టర్. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆగిపోయిన ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే దీపావళి సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. విజయ్ నటనను కొందరు ఆకాశానికెత్తుతున్నారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ టీజర్‌ను తెగ మెచ్చుకుంది.
సినిమా సినిమాకు అతడు మరింత యువకునిలా మారిపోతున్నాడు. విజయ్ ఐ లవ్యూ.. అంటూ ట్వీట్ చేసింది. టీజర్ చాలా బాగుందంటూ కితాబిచ్చింది. ఆమె చేసిన ట్వీట్ తెగ రీట్వీట్ అవుతోంది. ఇదిలా ఉంటే టీజర్ చూస్తుంటే విజయ్ రెండు లుక్స్‌లో కనినిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
How can he keep getting younger in every film…aiyyooooo #thalapathy @actorvijay I louuuuu you…#MasterTeaser – https://t.co/FYno10HoHe@Dir_Lokesh thank you 👏 👏👏 watteeeeee teaser..and a feast for us #Thalapathyfans..
So good to see @VijaySethuOffl Just can't wait..!!— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath) November 15, 2020