మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ఆచార్య. హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఘోరంగా షాక్ ఇచ్చింది. వరుస ఫ్లాపులతో ఉన్న చిరంజీవి… ఈ ఫ్లాప్ నుంచి వేగంగానే బయటకు వచ్చేశారు. ఇక నష్టాలను కొరటాల భరించారు అనే కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపించాయి. దీనిపై ఆయన నుంచి ఏ స్పందన రాలేదు.
ఇక చిరంజీవి కూడా… గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆచార్య విషయంలో తాము దర్శకుడు చెప్పినట్టే చేసామని అన్నారు. ఇక ఇదిలా ఉంటే ఆచార్యా సినిమా నష్టాలకు సంబంధించి చిరంజీవి తాజాగా కీలక కామెంట్స్ చేసారు. నష్టాలను భర్తీ చేసేందుకు గాను… తాను, రామ్ చరణ్ రెమ్యునరేషన్ లో 80 శాతం ఇచ్చేశామని చెప్పారు.
ఇక కొరటాల శివ… ఆచార్య నష్టాలను భరించేందుకు ఇల్లు కూడా అమ్మేసారు అనే మాట వినపడింది. మరి ఇది ఎంత వరకు నిజం అనే స్పష్టత లేకపోయినా దీనిపై కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక గాడ్ ఫాదర్ విషయంలో కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నా చిరంజీవి పట్టించుకోవడం లేదు. సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ కు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. సినిమాను సొంతగానే చిరంజీవి విడుదల చేసారు