తనకి అవకాశం వస్తే బయోపిక్ లో నటించటానికి సిద్ధంగా ఉన్నానంటోంది పూజా హెగ్డే. ఇటీవల బాలీవుడ్, టాలీవడ్ అనే తేడా లేకుండా బయోపిక్ లపై దృష్టి సారించారు మన హీరోయిన్లు.
ఒక్కఅవకాశం వస్తే అవార్డులు కొట్టేద్దామని చూస్తున్నారు. పూజా హెగ్డే కూడా అదే రూట్ ని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. పూజా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4 ‘ నటించిన సంగతి తెలిసిందే. పి.వి సింధు జీవిత ఆధారంగా రాబోతున్న బయోపిక్ లో అవకాశం వస్తే ఆ పాత్రకు న్యాయం చెయ్యటానికి శాయశక్తుల కృషి చేస్తానంటోది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుటికే బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లు రేస్ లో ఉన్నారు. పి.వి సింధు బయోపిక్ కి సంబంధించి ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి కావాల్సిన శారీరక ధారుడ్యం, కొంచెం అటు ఇటుగా పోలికలు కూడా ఉండటం పూజాకి ప్లస్ అనే చెప్పాలి. బాలీవుడ్ లో పూజా నటించిన హౌస్ ఫుల్ 4 హిట్ సాధిస్తే మాత్రం పి.వి సింధు బయోపిక్ లో పూజా హెగ్డే మెరిసే అవకాశాలు లేకపోలేదు.