కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్, సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన విక్రం సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
రోలెక్స్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిన అంశం. ఇక ఖైదీ సినిమాకు దీనికి లింక్ చేయడంతో ఖైదీ 2 సినిమాను ఏ మలుపులు తిప్పుతారు అనేది చూడాలి. లేదంటే విక్రమ్ 2 లేకుండా ఖైదీ సీక్వెల్ తో కంప్లీట్ చేస్తారనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో రోలెక్స్ పాత్ర చేసిన సూర్య రెమ్యునరేషన్ తీసుకోలేదు అని టాక్. అయితే కమల్ హాసన్ మాత్రం ఒక గిఫ్ట్ ఇచ్చారు.
ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి సూర్య… సైమా అవార్డుల కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాలో తాను ఇష్టం లేకుండా నటించానని, రోలెక్స్ రోల్ లో నటించాలంటే మొదట భయంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కు కాల్ చేసి చేయనని చెప్పాలని అనుకున్నానని కాని ఆ సమయంలో కమల్ హాసన్ సార్ ఫోన్ చేసి విక్రమ్ సినిమాలో రోల్ ఉందని చేయాలని కోరారని సూర్య వివరించాడు.