' నేనూ లైంగిక వేధింపులకు గురయ్యా '

చిన్నప్పుడు తను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని నటి నివేదా పేతురాజ్ తెలిపింది. అయిదేళ్ళ వయస్సులోనే తనను లైంగికంగా వేధించారని, ఈ విషయాన్ని తన తలిదండ్రులకు ఎలా చెప్పాలంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఆ వయస్సులో ఏం జరుగుతోందో కూడా తెలియదు. అపరిచితులతో కన్నా మన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిలోనే ఇలాంటి పనులకు పాల్పడేవారు ఉంటారు..ఈ వేధింపులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేం. అని పేర్కొన్న నివేదా… ఇప్పటికీ ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే తనకు భయంగా  ఉంటుందని, ఎవర్ని చూసినా మంచివారు కాదేమోననే అనుమానం కలుగుతుందని తెలిపింది. కానీ ఇలా చేయడం తప్పని, ఈ విషయంలో మగవారి సహకారం కూడా ఉండాలని కోరిన ఆమె.. పిల్లల్ని, ఆడవారిని కాపాడుకోగలిగిన వ్యవస్థ రావాలని ఆకాక్షించింది. ‘ మెంటల్ మదిలో ‘, ‘ ఒరు నాల్ కూతు ‘ వంటి సినిమాల్లో నివేదా నటించింది.