క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎన్నో విమర్శలు మనం వింటూనే ఉన్నాం. సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్ లు, ఇతర మహిళా నటులు కొందరు క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమలో అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా కోరికలు తీర్చాల్సిందే అని కొందరు ఇబ్బంది పెడతారు అంటూ మనం కామెంట్స్ వింటూనే ఉన్నాం. దీనిపై మీడియాలో కూడా చాలా చర్చలు జరిగాయి.
వాస్తవాలు ఎలా ఉన్నా సరే కొందరి టార్గెట్ గా కూడా ఈ విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలో పాపులర్ నటులకు సంబంధించి ఈ ఆరోపణలు గట్టిగానే వింటూ వచ్చాం మనం. ఇదిలా ఉంచితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించి నయనతార కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనే విషయం గురించి తాను మాట్లాడనని తెలిపింది. మన ప్రవర్తన బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నారు.
తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనని కూడా చాలా మంది కమిట్మెంట్ అడిగారని సంచలన వ్యాఖ్యలు చేసింది నయనతార. అయితే నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పానని పేర్కొంది. కేవలం నా టాలెంట్ నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చానని స్పష్టం చేసింది. నా టాలెంట్ తోనే ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ వ్యాఖ్యలు చేసింది. కాగా నయనతార గత ఏడాది విజ్ఞేశ్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.