తెలుగు సినిమా రంగంలో చెరగని ముద్ర వేసిన కమెడియన్ లలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. బయట లైఫ్ లో సీరియస్ గా ఉన్నా సరే సినిమాల్లో మాత్రం మంచి కామెడి చేసారు. ఇక రాజకీయాలతో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండే వారని అంటారు. ఆయనకు ప్రభుత్వంలో పదవి రావడానికి వైఎస్ కారణం.
ఈ విషయం గురించి ధర్మవరపు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటే బురదే అని చెప్పిన ఆయన అంటకుండా కూడా ఉండవచ్చన్నారు. తాను ఏ రోజు పదవిని ఆశించలేదని రాజశేఖర్ రెడ్డి పిలిచి తనకు పదవి ఇచ్చారని ధర్మవరపు వివరించారు. 700కు పైగా సినిమాలలో తాను నటించినట్టు చెప్పారు. ఇక రాజశేఖర్ రెడ్డి సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదన్నారు.
అయితే తానే ఎప్పుడైనా యాడ్ ఫిల్స్మ్ లేదా సినిమా షోలకు రాజశేఖర్ రెడ్డిని లాక్కెళ్లేవాడినని వివరించారు. వైఎస్సార్ తనకు ఎంతో సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత ఒక స్టార్ హీరో సినిమా డబ్బింగ్ కరెక్షన్ కు పిలిస్తే నేను వెళ్లలేదని ధర్మవరపు కామెంట్లు చేశారు. ఇక ప్రకాశం జిల్లాలో తన ఊరు మారుమూల గ్రామం అని చెప్పారు. బస్ ఎక్కాలంటే అక్కడి నుంచి 15 కిలోమీటర్లు రావాలని వివరించారు.