క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ ని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి. సోషల్ మీడియా వేదికగా అగ్రహీరోలందరిని ఒక ఆట ఆడుకుంటున్న ఈ అమ్మడు గతంలో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ తో పాటు, నాని పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు అదే స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా కామెంట్స్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో సారి ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది.
తనకన్నా ముందు నుంచే టాలీవుడ్ లో కాంట్రవర్శీలతో నడుస్తున్న రాంగోపాల్ వర్మను డేటింగ్ కు రమ్మంటూ పేస్ బుక్ లో పోస్ట్ చేసింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వివాదం లో చిక్కుకున్న వర్మ శ్రీ రెడ్డి పోస్ట్ పై ఏ విదంగా స్పందిస్తాడో వేచిచూడాలి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా లో తన క్యారెక్టర్ చేస్తున్న శ్రీ రెడ్డి, క్లైమాక్స్ అనే మరో సినిమా లో కూడా నటిస్తుంది.