చిన్న వయసులోనే హీరోయిన్ కావడమే కాకుండా అగ్ర హీరోలతో సినిమాలు చేసి మంచి స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది రమ్యకృష్ణ. అగ్ర దర్శకులకు నిర్మాతలకు ఆమె ఒకప్పుడు బంగారు బాతులా కనపడిన పరిస్థితి కూడా ఉంది. హీరోలు సైతం ఆమె కోసం ఎదురు చూసేవారు. ఇక హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తర్వాత ఆమె వెనక్కు తగ్గలేదు. నెగటివ్ రోల్స్ తో పాటుగా పలు కీలక పాత్రలు చేసింది. నరసింహ సినిమాతో ఆమెకు వచ్చిన స్టార్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. విలన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఆమె నటించి మెప్పించింది. ప్రస్తుతం డాన్స్ ఐకానిక్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర విషయం బయట పెట్టారు. ఈ కార్యక్రమం ప్రోమోను లేటెస్ట్ గా విడుదల చేసారు. ఒక లేడీ కంటెస్టెంట్ నా అల్లుడు సినిమాలోని సయ్యా సయ్యారే అనే పాటకు డాన్స్ చేసారు.
ఆ పాటతో తనకు ఉన్న జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ పాటకు తాను డాన్స్ చేసిన సమయంలో తాను నాలుగు నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇలా నాలుగు నెలలు ప్రెగ్నెంట్ అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో డాన్స్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకనే తనకు ఈ సాంగ్ ఎప్పటికీ ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. ఆమె త్వరలో రాబోయే ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం ఉంది.