ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పార్టీలు తమ దూకుడుకు పదునుపెట్టగా… బీజేపీపై బెంగాల్ సీఎం మరోసారి ఫైర్ అయ్యింది.
అల్లర్లను ప్రేరేపించడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని సీఎం మమత బెనర్జీ ఆరోపించారు. ఒకవేళ ప్రజలకు అల్లర్లు కావాలనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలన్నారు. మమత ఒంటరికాదని, మీరు ఓడించలేరని… నాకు ప్రజా మద్దతుందన్నారు. నేను బతికున్నంత వరకు బీజేపీని బెంగాల్ లోకి అనుమతించను అంటూ ఘాటుగా స్పందించారు.
రథ యాత్రలను బీజేపీ రాజకీయ యాత్రలుగా మార్చేసిందని… గతంలో జగన్నాథ రథయాత్ర, బలరామ రథయాత్రలు మనం చూడలేదా…? కానీ బీజేపీ మాత్రం ఎన్నికలప్పుడే యాత్రలు చేస్తుందని మండిపడ్డారు. వీటి ద్వారా సమాజంలో చీలిక తేవాలని చూస్తున్నారన్నారు.