భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద దేశంలో తయారు చేయనున్న
మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రవాణా విమానాలను కార్గో సేవల కోసం వినియోగించనున్నారు.
ఈ విమానాలు 18 నుంచి 30 టన్నుల మధ్య కార్గోలను మోసుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భారత వైమానిక దళం తెలిపింది. భారతదేశం ప్రతిష్టాత్మకమైన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో ఇటీవల భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా క్షిపణులు, ఫీల్డ్ గన్‌లు, ట్యాంకులు, విమాన వాహక నౌకలు, డ్రోన్‌లు, యుద్ధ విమానాలు, ట్యాంకులు, హెలికాప్టర్‌లు వంటి వివిధ రక్షణ ఆయుధాలను భారత సాయుధ దళాల ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
గతేడాది గుజరాత్‌లోని వడోదరలో భారత వైమానిక దళం కోసం ఎయిర్‌బస్ సీ-295 కోసం రవాణా విమానాల తయారీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఐఏఎఫ్ దాన్ని పాత అవ్రో విమానాన్ని సీ-295ఎండబ్ల్యూతో భర్తీ చేయనుంది.