కేంద్ర హోం మంత్రి అమిత్ షా నంటూ మధ్యప్రదేశ్ గవర్నర్ కు ఫోన్ చేసిన ఎయిర్ ఫోర్స్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో పనిచేస్తోన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ కుల్ దీప్ బగేలా తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నంటూ మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కు ఫోన్ చేశాడు.తన మిత్రుడు ఒకరికి మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పదవిలో నియమించాలని కోరాడు. ఈ ఫోన్ కాల్ పై విచారణ జరిపిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఫోన్ చేసింది కుల్ దీప్ బగేలా, అతని మిత్రుడు చంద్రకుమార్ శుక్లాగా గుర్తించారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు.
స్పెషల్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అశోక్ అవస్థి మీడియాతో మాట్లాడుతూ…బగేలా తన మిత్రుడు శుక్లా పేరును మధ్యప్రదేశ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పోస్టుకు సిఫార్స్ చేశాడు. వారిద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు అడిషనల్ డీజీ తెలిపారు. వారిద్దరి వయసు 35-40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.