భారత వైమానిక దళానికి చెందిన లేడీ ఫైటర్ పైలెట్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫైటర్ పైలెట్ అవని చతుర్వేది జపాన్ లో జరగనున్న వైమానిక దళ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనబోతుంది.
ఐఏఎఫ్ మహిళా ఫైటర్ పైలెట్.. ఓ విదేశీ విన్యాసంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని పైలెట్ అవని చతుర్వేది ఫ్లయ్ చేస్తుంది.
జపాన్ లోని హ్యాకురి ఎయిర్ బేస్ లో జనవరి 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే వీర్ గార్డియన్ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనబోతుంది ఫైటర్ పైలెట్, స్క్వాడ్రన్ లీడర్ అవని.
స్క్వాడ్రన్ లీడర్ భావ్నా కంత్ కూడా ఫైటర్ పైలెట్ గా శిక్షణ తీసుకున్నారు. మల్టీ రోల్ కంబాట్ ఫైటర్ ప్లేన్‌గా సుఖోయ్-30ఎంకేఐ పనిచేస్తుందని తెలిపారు భావ్నా కంత్.