73 ఏండ్ల తర్వాత తొలిసారిగా భారత బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ గెలుచుకుని రికార్డు సృష్టించింది. దీంతో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే దీనిపై ఓ ఐఏఎస్ పెట్టిన పోస్టు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
భారత విజయాన్ని పరిహాసం చేస్తూ ఐఏఎస్ అధికారి సోమేష్ ఉపాధ్యాయ ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ఓ దోమల బ్యాట్ ఫోటో పెట్టాడు. థామస్ కప్ లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిందంటూ దోమల్ బ్యాట్ కు క్రెడిట్ ఇస్తూ ట్వీట్ చేశాడు.
ఇండియన్ టీమ్ తమ కన్నా ఇంత గొప్పగా ఎలా ఆడగలిగిందని ఇండోనేషియన్స్ ఆశ్చర్యపడుతూ ఉంటారని ఆయన ట్వీట్ లో రాసుకొచ్చాడు. భారత జట్టు గొప్ప ప్రదర్శనకు కారణమిదే నంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
సోమేష్ పోస్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐఏఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఈ ట్వీట్ పై భారత మాజీ క్రికెట్ అమిత్ మిశ్రా తీవ్రంగా మండిపడ్డాడు. ‘ ఈ వ్యాఖ్యలు అసహ్యకరమైనవి మాత్రమే కాదు. మన భారత బ్యాడ్మింటన్ హీరోల విజయాన్ని అవమానించేవి’ అని తీవ్రంగా ధ్వజమెత్తాడు.