పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో కొందరు దుండగులు 2015 బ్యాచ్ ఐఏఎస్ టాపర్ టీనా దబి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు సందేశాలు ప్రచారం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఐఏఎస్ ఆఫీసర్ టీనా దబి పేరుతో ఫేస్ బుక్ లో సందేశాలు ప్రచారమవుతున్నాయి. ఒక ఐఏఎస్ అధికారి ఇలా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడంపై అనుమానం వచ్చిన మీడియా ప్రతినిధులు టీనా దబిని కలిసి వివరణ కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ తాను అలాంటి పని చేయలేదని…అది తన పేరు మీద ఉన్న నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ అయ్యుండొచ్చన్నారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.